ఆరిబండి లక్ష్మీనారాయణ ఆశలను సాధించాలి

 

మిర్యాలగూడ. జనం సాక్షి.
అరిబండి లక్మి నారాయణ 24 వర్ధంతి సందర్భంగా సిపిఎం కార్యాలయంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా నాయకులు డా.మల్లు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ రైతంగ సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేపట్టారని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలను సమీకరించి పోరాటాలు చేశారన్నారు. ఉపాధ్యాయ వృత్తిని వదిలి తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకపాత్ర పోషించాలని కొనియాడారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసే నీతి నిజాయితీకి నిబద్ధతకు ఆదర్శంగా నిలిచారన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం విశేష కృషి చేశారన్నారు. సాగు, తాగునీటి, రోడ్లు, కరెంటు సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వాలపై ఉద్యమాలతో ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కారానికి పాటుపడ్డారన్నారు. ఆయన చూపిన మార్గాన్ని కార్యకర్తలు ఆచరించి ఆశయాలను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు భవాండ్ల పాండు, రాగిరెడ్డి మంగా రెడ్డి, తిరుపతి రామ్మూర్తి, గుణగంటి రాంచంద్రు, పాపి రెడ్డి, లక్మి నారాయణ, పాల్వాయి రాంరెడ్డి, మాధవ రెడ్డి, బిఎం నాయుడు, వాస శివ, నసీర్ తదితరులు పాల్గొన్నారు.