ఆర్జీ-1 జీఎంకు హెచ్‌ఎంఎస్ వినతిపత్రం
గోదావరిఖని, జులై 16, (జనం సాక్షి)
ఆర్జీ-1 జనరల్ మేనేజర్‌కు సోమవారం హెచ్‌ఎంఎస్ ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రం అందచేశారు. 2, 2ఎ ఇంక్లయిన్‌ల డివైజీఎం, స్టాఫ్ కార్యాలయాలను 3వ ఇంక్లయిన్ కార్యాలయానికి మార్చాలని వారు ఆ వినతిపత్రంలో కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… సిహెచ్‌పి అనుబంధ కోల్‌యార్డుల నుంచి బొగ్గు దుమ్ము, ధూళిలతో కార్మికులు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, అలాగే కంప్యూటర్లు సక్రమంగా పనిచేయడం లేదని వారు పేర్కొన్నారు. వెంటనే 2, 2ఎ పిట్ కార్యాలయాలను 3వ ఇంక్లయిన్ కార్యాలయానికి మార్చాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందించిన వారిలో నాయకులు యాదగిరి సత్తయ్య, మేర్గు రాజయ్య, కనకయ్య, అక్బర్ పాష, రామస్వామి, నర్సయ్య, హరిన్, బుద్దారెడ్డి, మాదాసు రామస్వామి, బాలయ్య, రేండ్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.