ఆర్టిసి బస్టాండ్లలో సౌకర్యాలు మెరుగు పరచండి

కామారెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు అశోక్ రాజ్
జుక్కల్, అక్టోబర్11, (జనంసాక్షీ) ,
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని ఆర్టీసి బస్టాండ్ లలో సౌకర్యాలు మెరుగు పరచాలని భారతీయ జనతాపార్టీ కామారెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు చిలువేరి అశోక్ రాజ్ ప్రభుత్వానికి జనంసాక్షి ద్వారా మంగళవారం డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన చరవాణి లో మాట్లాడుతు మంగళవారం జనంసాక్షీ దిన పత్రిక లో “ఆర్టిసి ప్రయాణ ప్రాంగాణాలు సమస్యల నిలయాలు కదనం చూశానని తెలిపారు. నియోజకవర్గంలోని పిట్లం, బిచ్కుంద, జుక్కల్, నిజాం సాగర్, మద్నూర్ మండల కేంద్రాలలో గత30 సంవత్సరాల క్రితం తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రయాణ ప్రాంగణాలు నేడు శిథిలావస్థకు చేరుకున్నాయని అన్నారు. బస్టాండ్లలో కనీసం మరుగుదొడ్లు కూడా లేక పోవడంతో మహిళలుఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బస్టాండ్లు నిర్మించిన తరువాత కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అధికారంలోకి వచ్చినా ఎవ్వరు పట్టించు కోలేదని విమర్శించారు. రాత్రి అయితే ఈ బస్టాండ్లు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని ఆరోపించారు. జుక్కల్ నియోజకవర్గం ఎమ్మె ల్ల్యే గా హన్మంత్ షిండే మూడుసార్లు గెలిచారని, ప్రస్తుతం ఫ్యానల్ స్పీకర్ గా కూడా కొనసాగుతున్నారని , అలాగే ఇదే నియోజక వర్గం నకు చెందిన బీబీ పాటిల్ వరుసగా రెండవసారి ఎంపిగా గెలు పొందా రని తెలిపారు. ఇదే నియోజవర్గం నకు చెందిన దఫెదార్ రాజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారని,ప్రస్తుతం ఆయన సతీమణి కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా పదవిలో ఉన్నారని తెలిపారు. జుక్కల్ నియోజకవర్గం నకు చెందిన ఈ ముగ్గురు నేతలు అధికార పార్టీలో ఉండి కీలక పదవులు నిర్వహిస్తున్న ఆర్టీసి ప్రయాణ ప్రాంగణాలు అధ్వాన్నంగా ఉండటం శోచనీయమని అన్నారు.
Attachments area