ఆర్టీసీ కార్మికులకు ప్రారంభమైన శిక్షణ

బోధన్, సెప్టెంబర్ 7 ( జనంసాక్షి ) :  తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, యం.డి. వి. సి. సజ్జనార్ సూచనల మేరకు తెలంగాణలోని అన్ని డిపోల్లో ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం – పేరుతో ప్రారంభమైన సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం బోధన్ డిపోలో డిపో మేనేజర్ స్వామి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమిష్టి కృషితో సంస్థను ఏ విధంగా లాభాల బాటలో తీసుకు రావాలి, మారుతున్న పరిస్తితులకు అనుగుణంగా ప్రయాణీకులకు సేవలు అందించాలి, విదులలో ఒత్తిడిని ఏ విధంగా జయించాలి, ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి, ఆర్థిక ప్రణాళికా ఏ విధంగా చేసుకోవాలి అనే అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులతో పాటు, వివిధ రంగాలలో నిష్ణాతులను పిలిపించి వారిచే సిబ్బందికి శిక్షణ ఇప్పించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమం నెల రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని మొదటి రోజు ప్రారంభ కార్యక్రమంలో డాక్టర్ అశ్విని చౌదరి పాల్గొని సిబ్బందికి ఒత్తిడి నిర్వహణ మరియు మంచి ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించినట్లు డిపో మేనేజర్ . తదనంతరం డిపో ఆర్థికాభివృద్ధికి సమిష్టి కృషి గురించి డిపో మేనేజర్  టియన్. స్వామి సిబ్బందికి తెలిపారు. ఆర్థిక ప్రణాళికా గురించి రాములు వివరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది సిబ్బంది పాల్గొన్నారు.