ఆర్టీసీ బస్సు- ఆటో ఢీకొని 10 మందికి గాయాలు
రంగారెడ్డి, జనంసాక్షి: జిల్లాలోని తాంగూర్ మండలం రాంపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.