ఆర్థిక సంస్కరణల ద్వారానే పేదరిక నిర్మూలన
ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్
న్యూఢిల్లీ, జనవరి 31 (జనంసాక్షి) :
ఆర్థిక సంస్కరణల అమలుతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమగ్రాభివృద్ధి సదస్సును ఆయన ప్రారంభించి మాట్లాడారు. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకనుగుణంగా వృద్ధి సాధించాల్సిన ఆవశ్యకత ఉందాన్నారు. ఇంకా పాత చింతకాయ పచ్చడిలాంటి కట్టుబాట్లు పట్టుకు వేలాడొద్దని సూచించారు. ప్రపంచీకరణ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందు వరసలో ఉందన్నారు. ప్రజల సమగ్రాభివృద్ధి, వికాసానికి కృషి చేస్తామన్నారు. అందరికి విద్య, ఆహార భద్రత కల్పించడం ద్వారానే అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయవచ్చన్నారు. పేదరిక నిర్మూలనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందాన్నారు. నేరుగా ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తున్న లబ్ధి అందేందుకే నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టాన్నారు. పారిశ్రామిక ప్రగతితో ఉపాధి కల్పన విస్తరిస్తుందని, తద్వార పేదరికం తగ్గిపోతుందన్నారు. ఇవన్నీ సంస్కరణ ద్వారానే సాధ్యమన్నారు.