ఆర్కె స్వామి హై పెర్ఫార్మెన్స్ బ్రాండ్ అవార్డు 2022ను అందుకున్న ఫ్రీడమ్
ఖైరతాబాద్: సెప్టెంబర్ 22 (జనం సాక్షి) జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎఫ్ ఇండియా)కు అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రాండ్ ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ అత్యంత ప్రతిష్టాత్మకమైన (ఐమా) ఆర్కె స్వామి హై పెర్ఫార్మెన్స్ బ్రాండ్ అవార్డు 2022 ను అందుకుంది. అడ్వాంటేజ్ ఇండియా థ్రైవింగ్ ఇన్ ద న్యూ వరల్డ్ ఆర్డర్ నేపథ్యంతో నిర్వహించిన ఐమా యొక్క 49 వ జాతీయ మేనేజ్మెంట్ కన్వెన్షన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అందజేశారు. ఈ అవార్డును భారత ప్రభుత్వ రోడ్డు రవాణా హైవే మంత్రిత్వ శాఖా మంత్రి నితిన్ గడ్కరీ నుంచి ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ పి.చంద్రశేఖర రెడ్డి అందుకున్నారు. ఐమా ఆర్కె స్వామి హై పెర్ఫార్మెన్స్ బ్రాండ్ అవార్డు ను 2009లో ఎడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ఆర్ కె.స్వామి, ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్లు, ఏజెన్సీ యొక్క వ్యవస్థాపకులు ఆర్.కె.స్వామి జ్ఞాపకార్థం ప్రారంభించాయి. ఐమా పూర్వ అధ్యక్షులుగా ఆర్.కె.స్వామి వ్యవహరించారు. ఈ అవార్డును అత్యున్నత ప్రదర్శన కనబరుస్తూ వృద్ధి చెందుతున్న భారతీయ బ్రాండ్‌కు అందిస్తుంటారు. జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ చౌదరి మాట్లాడుతూ తమ ఉద్యోగులు, డిస్ట్రిబ్యూటర్లు, ఏజెన్సీ భాగస్వాములు గత కొద్ది సంవత్సరాలుగా పడుతున్న కష్టాన్ని ఈ అవార్డు ప్రతిబింబిస్తుందన్నారు. ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ నిరంతరమూ చక్కటి నాణ్యత కలిగిన ఉత్పత్తులు, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, లోతైన మార్కెట్ పరిజ్ఞానం, విస్తరణ, వినూత్నమైన మార్కెటింగ్, కస్టమర్ ఔట్రీచ్, కమ్యూనికేషన్ వ్యూహం వంటి ఫండమెంటల్స్‌పై ఫ్రీడమ్ బ్రాండ్ రూపు దిద్దుకుందన్నారు. ఆర్.కె స్వామి ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఐమా పూర్వ అధ్యక్షులు కావడంతో పాటుగా ఈ జ్యూరీకి ఛైర్మన్ మాట్లాడుతూ పలు బ్రాండ్ల ప్రదర్శనను పరిశీలించిన తరువాత ఫ్రీడమ్‌ను విజేతగా ఎంపిక చేశామన్నారు.