*ఆర్ & బి రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ కు వినతి*
– రోడ్డు నిర్మించకపోతే ఆందోళనకు సిద్ధం
– వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత కౌన్సిల్ సభ్యులు, మాజీ ఎంపీపీ ములకలపల్లి రాములు హెచ్చరిక మునగాల, అక్టోబర్ 11(జనంసాక్షి): మునగాల మండల కేంద్రం నుండి కొక్కిరేణి మీదుగా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం వరకు 20 కిలోమీటర్ల ఆర్ అండ్ బి రోడ్డును వెంటనే నిర్మాణం చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత కౌన్సిల్ సభ్యులు, మునగాల మాజీ ఎంపీపీ ములకలపల్లి రాములు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కు సర్పంచ్, ఎంపిటిసి బృందం తరపున మెమోరాండం చేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ, మూడు నియోజకవర్గాల్లో 20 గ్రామాల ప్రజలు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారని, ఈ రోడ్డుపై కనీసం మరమ్మతులు లేక గుంతలమయం వర్షాలు కురిసినప్పుడల్లా 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అవుతున్నాయన్నారు. ఈ రోడ్డు గుంతలమయం కావటంతో గత రెండు సంవత్సరాల్లో ఈ రోడ్డుపై ప్రమాదానికి గురిఅయి 6 గురు ప్రయాణికులు మృతి చెందారన్నారు. అలాగే ప్రమాదాలు జరగటంతో అనేకమంది వికలాంగులు అయినారని రాములు అన్నారు. అనేకసార్లు ఆర్ అండ్ బి అధికారులకు విన్నవించినా కనీసం పట్టించుకోవడం లేదని వారు కలెక్టర్ కు విన్నవించారు. వారం రోజుల్లో నిర్మాణ పనులు చేపట్టకపోతే నేషనల్ హైవేను వేలాది మంది ప్రజల చేత రోడ్డు దిగ్బంధం చేస్తామని వారు హెచ్చరించారు. ఆర్ అండ్ బి అధికారులు కళ్ళుండీ చూడలేని కబోదిలా వ్యవహరిస్తున్నారని వారన్నారు . సీఆర్ఎఫ్ నిధులతో 20 కోట్లు మంజూరు అయినట్లు గత మూడు సంవత్సరాల నుండి చెబుతున్నా నేటికీ పనులు ప్రారంభించక పోవటం విచారకరమని, పనులు ప్రారంభిచకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి కారణం అని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని రాములు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, రంగాపురం సర్పంచ్ బోళ్ల జోజమ్మ, కొక్కిరేణి ఎంపిటిసి ఎర్రం శ్రీనివాస్ రెడ్డి, కొండమీద గోవిందరావురావు, కొక్కిరేణి తిమ్మారెడ్డిగూడెం ఉప సర్పంచులు రావులపెంట బ్రహ్మం కాల్వ అచ్చయ్య, కొక్కిరేణి మాజీ సర్పంచ్ రావులపెంట వెంకన్న, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సైదులు, ఇంటూరు హుస్సేన్, అత్తరు బాషా, రేఖ లింగయ్య, వివిధ గ్రామాల ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.
|