ఆవిరైన గల్ఫ్ ఆశలు..ప్రాణం మీదికి తెచ్చిన అప్పులు..
గుండె పోటు అద్దకం కార్మికుడు మృతి.
కుటుంబానికి పెద్ద దిక్కును కూల్పోయిన పేద కుటుంబం.
సిరిసిల్ల ముస్టిపల్లి లో విషాదం.
రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో, సెప్టెంబర్ 28, (జనం సాక్షి). ఉన్న ఊర్లో ఉపాధి కనిపించకపోవడంతో అప్పులు చేసి ఆశతో ఎడారి దేశానికి పయనమయ్యాడు. ఆశలు ఆవిరై అప్పులతో తిరిగి స్వదేశానికి వచ్చాడు. కుటుంబాన్ని పోషించుకునేందుకు అద్దకం కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అప్పులు తీర్చే మార్గం కానరాక మానోవేద తో కృంగిపోయాడు. పనిచేస్తుంది చాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. తోటి కార్మికులు ఆసుపత్రికి తరలించారు గుండె పోటు కన్నుమూయడం తో ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన నిరుపేద కుటుంబం పుట్టెడు దుఃఖంలో మునిగింది.. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ముష్టిపల్లిలో విషాదం చోటచేసుకుంది బంధువులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10 వార్డు ముష్టిపల్లికి చెందిన కాధాసు శంకర్ (45). భార్య దేవవ్వ, ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నారు. బతుకుజట్ కోసంఅప్పులు చేసి శంకర్ గల్ఫ్ దేశానికి వలస వెళ్ళాడు. అక్కడ సరైన ఉపాధి లేకపోవడంతో గల్ఫ్ ఎడారిలో ఆశలు ఆవిరి కావడంతో తిరిగి స్వదేశానికి వచ్చాడు. అప్పటినుంచి సిరిసిల్ల పట్టణంలోని ఆద్ధకం పరిశ్రమలు పనిచేస్తున్నాడు. ఆ పనులు కూడా అక్రమంగా లేకపోవడంతో కాళీ రోజుల్లో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. మూడు నెలల క్రితం పెద్ద కూతురు వివాహ చేసాడు. ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఐదు లక్షల వరకు ఆయన అప్పులను ఎలా తీర్చాలని కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలంటు సన్నిహితుల దగ్గర వాపోయేవాడు. ఈ క్రమంలో మంగళవారం అద్దకం యూనిట్ లో పనిచేస్తుండగా చాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. తోటి కార్మికులు ఆసుపత్రికి తరలిస్తుండగా గుండెపోటుతో కన్నుమూశాడు. ఇంటికి పెద్ద దిక్కులు కోల్పోవడం నిరుపేద కుటుంబం పుట్టెడు దుఃఖంలో మునిగి పోయింది. శుభ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. శంకర్ మరణం ముష్టిపల్లిలో తీరని విషాదం నింపింది.ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన సహాయ స్థితిలో ఉన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక కౌన్సిలర్ నాగరాజుగౌడ్ స్థానికులు కోరుతున్నారు.