ఆవిర్భావ వేడుకలకు సింగరేణి ముస్తాబు

అలంకరణకు ప్రాధాన్యం ఇవ్వనున్న అధికారులు
కొత్తగూడెం,మే22(జ‌నం సాక్షి): సింగరేణి ఏరియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను వచ్చే నెల 2న ఆకర్శణీయంగా, ఘనంగా నిర్వహించాలని ఏరియా జీఎం కేవీ రమణమూర్తి అధికారులనాదేశించారు. దీంతో ఏర్పాట్లను ఘనంగా నిర్వహించేలా చేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రకాశం మైదానంలో నిర్వహించే నేపథ్యంలో వివిధ విభాగాల అధిపతులతో  సవిూక్షా సమావేశాన్ని నిర్వహించారు. సింగరేణి ఛైర్మన్‌ శ్రీధర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు స్టాల్స్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.  కార్యాలయాలను, గని ఆవరణలను విద్యుత్తు దీపాలతో అలంకరించాలని, మామిడి తోరణాలతో పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తెలంగాణ రన్‌ను నిర్వహిస్తామన్నారు. ఉత్తమ కార్మికుల ఎంపిక, మహిళలకు, పిల్లలకు క్రీడా పోటీల నిర్వహణ తదితర కార్యక్రమాలను నిర్వహించాల్సిందిగా సూచించారు. ఆవిర్భావ వేడుకల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్‌ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రుద్రంపూర్‌ ప్రగతివనంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆఫీసులు,
గనులు, డిపార్ట్‌మెంట్లు, కార్యాలయాలకు రంగు రంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించాలని, అన్ని గనులు డిపార్ట్‌మెంట్లను మామిడి తోరణాలతో పండుగవాతావరణం తలపించేలా ఏర్పాట్లుచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్వహించే తెలంగాణ రన్‌ను, ఉత్తమ కార్మికుల ఎంపిక, పిల్లలకు, మహిళలకు ఆటల పోటీలు నిర్వహించనున్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు వచ్చేవారందరికి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సివిల్‌, వర్క్‌షాపు, పర్సనల్‌, సెక్యూరిటీ అధికారులకు పలు సలహాలు, సూచనలిచ్చారు. సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్‌ కార్మికవాడల్లో ఉన్న ఉద్యమ స్ఫూర్తి ప్రాంగణంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి, జయశంకర్‌సార్‌, విగ్రహాలకు పేయింటింగ్‌, విద్యుత్తు దీపాల అలంకరణ, ఇతర పనులను చేపట్టి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని  నిర్మాణ కమిటీ సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద అమరవీరుల స్తూపానికి సుందరీకరణ పనులు చేపట్టాలని, ప్రాంగణంలో ఉన్న ఇతర విగ్రహాలను కూడా అలంకరించాలని ప్రాంగణం మొత్తానికి విద్యుత్తు దీపాలతో అలంకరించాలని ప్రాంగణం ముందు బాగంలో సీసీరోడ్డు పనులను చేపట్టాలన్నారు. ప్రాంగణం మొత్తానికి పేయింట్‌పనులు చేపించాలని, మలిదశ ఉద్యమంలో ఉద్యమం చేసిన వారిని సన్మానించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.