ఆసరా ఐడి కార్డుల పంపిణీ
డోర్నకల్ అక్టోబర్ 8 జనం సాక్షి
రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన నూతన పింఛన్ మంజూరు పత్రాలు,డిజిటల్ కార్డులను శనివారం మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ శీలం భాగ్యలక్ష్మి శ్రీనివాస్ అందజేశారు.వార్డులోని లబ్ధిదారుల ఇండ్లకు నేరుగా వెళ్లి కార్డులు అందజేశారు.ఈ సందర్భంగా ఆమె వారిని ఆప్యాయంగా పలుకరించారు.కార్యక్రమంలో బిల్ కలెక్టర్ వీరస్వామి,లబ్ధిదారులు పాల్గొన్నారు.