ఆస్ట్రేలియా ఘన విజయం
పల్లెకెలె: భారత్‌తో జరిగిన పోరులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది..సూపర్8 పోరులో భాగంగా శుక్రవారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఇండియాపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది…టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్ బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 140 పరగులతో సరిపెట్టుకొంది..141 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఓపెనర్లు షేన్ వాట్సన్, వార్నర్ చితక్కొట్టడంతో కేవలం 14.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది..భారత్ బౌలర్లలో యువరాజ్ మాత్రమే ఒక వికెట్ తీయగా మిగిలిన వారంతా విఫలమయ్యారు.