ఆ ఛానళ్లలో ప్రకటనలు నిలిపివేసేలా ఒత్తిడి తెస్తాం: దాసరి
హైదరాబాద్: అనువాద ధారావాహికలను ప్రసారం చేసే తెలుగు ఛానళ్లకు ప్రకటనలు నిలిపివేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామని దర్శకరత్న దాసరి నారాయణరావు హెచ్చరించారు. తెలుగు టెలివిజన్ పరిశ్రమ పరిరక్షణ సమితి డబ్బింగ్ సీరియళ్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి బాసటగా నిలుస్తున్న ఆయన తెలుగు టీవీ కళాకారుల పొట్టకొట్టేలా ఛానళ్ల యాజమాన్యాలు ప్రవర్తించరాదన్నారు. అనువాద ధారావాహికల వల్ల తెలుగు జాతిని నాశనం చేసే ఘనత దక్కించు కోవద్దని సూచించారు. ఇందిరా పార్కు వద్ద కొద్ది రోజులుగా నిరవధిక దీక్షలు చేస్తున్న టీవీ అర్టిస్టులు మేడే సందర్భంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.