ఇంటింటా ఇన్నోవేషన్ పై అవగాహనా కార్యక్రమం

 – విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు గ్రామీణ ఇన్నోవేటర్ యాంకర్ గణేష్  తో అవగాహన
కలెక్టర్ పమేలా సత్పతి
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికితీసే “ఇంటింటా ఇన్నోవేటర్”  కార్యక్రమం  లో జిల్లానుంచి అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా  సత్పతి  కోరారు.గత సంవత్సరం ఈ కార్యక్రమానికి మన జిల్లా నుండే అత్యధిక నామినేషన్ లు పంపి మొదటిస్థానం లో ఉన్నామని,  ఈ   “ఇంటింటా ఇన్నోవేటర్” కార్యక్రమం లో భాగంగా తెలంగాణ రాష్ట్ర  ఇన్నోవేషన్ సెల్  వారు  జిల్లాలోని  అన్ని రంగాలలోని ప్రజల నుండి వాట్సప్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.  గ్రామాలలో,పట్టణాలలో ఉండే అన్ని రంగాల మరియు వర్గాల నుండి ఆవిష్కరణలను ఆహ్వానిస్తుంది.  అనగా గ్రామీణ ఆవిష్కరణలు, విద్యార్థుల ఆవిష్కరణలు, ప్రారంభ ఆవిష్కరణలు, సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలలో ఆవిష్కరణలు మొదలైన వారు అధిక నామినేషన్ లు పంపి జిల్లాను ముందు నిలపాలి అని  తెలిపారు. ఈ కార్యక్రమాన్ని  తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్  సెల్  & రాష్ట్ర    డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. జిల్లా అధికారులు   వారి పరిధిలోని ఇన్నోవేటర్లను గుర్తించి వారిని  ఈ ఇంటింటా ఇన్నొవేటర్ కార్యక్రమానికి నమోదు చేసుకొనేలా ప్రొత్సహించాలని తెలిపారు.
 జిల్లా అడిషనల్ కలెక్టర్  దీపక్ తివారి  మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంత పౌరులు, విద్యార్ధులు, చిన్న తరహా, కుటీర, అంకుర పరిశ్రమల వారు, వ్యవసాయదారులు, గృహిణులు , సాధారణ ప్రజల నుండి వారి నిత్యజీవితం లో ఎదురయ్యే సమస్యలకు వినూత్న పరిష్కారం కనుగొనే విధంగా ఆవిష్కరణలు చేసి ఉన్నట్లైతే వారు ఈ ఇంటింటా ఇన్నొవేటర్ కార్యక్రమానికి నమోదు చే సుకోవచ్చు అని తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ నారయణ రెడ్డి గారు మాట్లాడుతూ  ఈ   ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం  కు అన్ని యాజమాన్యాల పాఠశాల, కళాశాలల విద్యార్ధులు అర్హులే అని తెలిపారు.అన్ని స్థాయిలలోని విద్యార్ధుల ఆవిష్కరణలను ఈ కార్యక్రమానికి నమోదు చేసుకోవాలని తెలిపారు.
*ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణ వివరాలైన
ఆవిష్కర్త పేరు, వయస్సు, వృత్తి , గ్రామం, జిల్లా.
 ఆవిష్కర్త వివరణ యొక్క వ్యా ఖ్యలు,
ఆవిష్కరణ యొక్క నాలుగు  చిత్రాలు.
 ఆవిష్కరణకు సంబంధించిన రెండు  నిమిషాల వీడియోను
*9100678543* అనే నంబరు కు వాట్సప్ ద్వారా ఆగస్టు 5వ తేదీ లోపు  దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపిక అయిన ఆవిష్కరణలను  ఆగస్టు 15 న జిల్లా లో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో వాటిని ప్రదర్శించే అవకాశం ఉంటుందని  తెలిపారు . ఆవిష్కర్తలకు సర్టిఫికేట్  ప్రధానం తో పాటు   TSIC టీం ద్వారా ఉత్తమ ఆవిష్కరణలకు సాంకేతిక సహకారం కూడా అందించబడుతుంది అని అన్నారు.  మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్ అధికారి భరణి కుమార్ నంబరు 9000989726 ను సంప్రదించగలరని తెలిపారు. ఈ కార్యక్రమం లో   జిల్లా విద్యాశాఖ అధికారులు, సైన్స్ ఉపాధ్యాయులు, సబ్జెక్ట్ ఫోరమ్ అధ్యక్షులు పాల్గొన్నారు
.