ఇండియన్ గ్రాండ్‌ప్రి విజేత వెటల్
న్యూఢిల్లీ, అక్టోబర్ 28 : ఇండియన్ పార్ములా వన్ గ్రాండ్ ఫ్రీ గ్రేటర్ నోయిడాలో ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. గ్రాండ్ ఫ్రీ టైటిల్ సెబాస్టియన్ వెటెల్ దక్కించుకుంది. రెండో స్థానంలో ఫెర్నాండో అలొన్సో, మూడో స్థానంలో మార్‌క వెబర్, నాలుగో స్థానంలో లెవిస్ హామిల్లన్, ఐదో స్థానంలో జెన్సన్ బటన్ నిలిచింది. వెటెల్ వరుసగా రెండోసారి టైటిల్ సాంతం చేసుకుంది. ఫోర్స్ ఇండియా రేసర్లు హాల్ కెన్ బర్క్ 8వ స్థానంలో, పాల్ డీ రెస్టాలు 12వ స్థానంలో నిలిచారు. నారాయణ కార్తికేయన్ 21వ స్థానంలో నిలిచారు. నోయిడాలోని బుద్ధ సర్క్యూట్ ఈ రేస్‌కు వేదిక అయింది. ఛాంపియన్ రేసర్‌లు సెబాస్టియన్ వెటెల్, ఫెర్నాండో ఆలాన్సోల మధ్య ఉత్కంఠ పోరు జరుగుతోందని అందరూ భావించారు. అదే జరిగింది. కాగా అంతకుముందు భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ… భారతదేశంలో ఫార్ములా వన్ రేసు నిర్వహించడం గర్వంగా ఉందని ఫార్ములా వన్ రేసులో ఫెరారీ గెలిచే అవకాశాలు ఉన్నాయని అశాభావం వ్యక్తం చేశారు. ఫెరారీ అతిథిగా ఇటలీ జట్టు గ్యారోజీలే హర్భజన్ కాసేపు గడిపారు. ఫెరారీ అంటే తనకు ఎంతో అభిమానమని, అలోన్సో అంటే ఇష్టమని చెప్పారు.నారాయణ కార్తికేయన్ 21వ స్థానంలో నిలిచారు.