ఇండియా గెలుపుకి కారణం గంభీర్ సెంచరీనే : సురేష్‌రైనా
కొలంబో, జూలై 29 (జనంసాక్షి) : ప్రేమదాస స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో టీమిండియా, శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండు బంతులు మిగిలి ఉండగానే టీమిండియా 287 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించింది. ఈ సందర్భంలో మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సురేష్ రైనా మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆడుతున్న నా క్రీడా జీవితంలో ఓవర్‌కు ఎనిమిది పరుగుల కావాల్సినప్పుడు ఎలా ఆడాలో నేర్చుకున్నాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గౌతమ్ గంభీర్ చాలా చక్కగా రాణించాడు. మిడ్ వికెట్ కవర్స్‌లో షాప్స్ బాదుతూ వీలు చిక్కినప్పుడల్లా పరుగులు సాధించాం. ఈ మ్యాచ్ గెలవడానికి కారణం గౌతమ్ గంభీర్ అంటూ మ్యాచ్ అనంతరం రైనా గంభీర్‌ని ప్రశంసలతో ముంచెత్తాడు. 45 బంతులలో 65 పరుగులు సాధించిన సురేష్ రైనాకి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు లభించింది. కెప్టెన్ ధోని, సురేష్ రైనా, గౌతమ్ గంభీర్ ఇద్దరూ నిలకడగా రాణించి టీమిండియాకు విజయాన్ని అందించారని అన్నాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 286 పరుగుల స్కోరు చేసింది. బదులుగా 287 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 2 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం చేధించింది. ఫలితంగా 5 వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది.