ఇండ్ల నిర్మాణదారులకు చెక్కులను పంపిణీ చేసిన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి.
బాన్సువాడ, అక్టోబర్ 20 (జనంసాక్షి):
పేదల ఆత్మగౌరం కాపాడడానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని తెరాస ప్రభుత్వం చేపట్టడం జరిగిందని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కోనాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు ఆత్మగౌరవంతో బతకడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడక గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని అందులో భాగంగా నియోజకవర్గంలో ఇండ్లు లేని నిరుపేదలు ఉండకూడదనే సదుద్దేశంతో నియోజకవర్గంలో పదివేల ఇళ్లను మంజూరు చేసుకొని, సుమారు 6000 ఇండ్ల నిర్మాణం పూర్తయి జరిగిందన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయని దీని ఓర్వలేని బిజెపి పార్టీ లేని పోనీ ఆరోపణలు చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజా గౌడ్,గ్రామ సర్పంచ్ వెంకట రమణారావు దేశ్ముఖ్, ఎంపీటీసీ జేట్టి హన్మండ్లు, ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి, కదలాపూర్ సర్పంచ్ భాస్కర్, డిసిసిబి డైరెక్టర్ సంగ్రామ్ నాయక్, సంగోజిపేట్ సర్పంచ్ లక్ష్మి శంకర్ గౌడ్, తెరాస గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, సతీష్ ,గంగాధర్, పంచాయతీ రాజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
2 Attachments • Scanned by G