ఇందిరమ్మ కలలపై గ్రామసభలు
దంతాలపల్లి: ఇందిరమ్మ కలలు కార్యక్రమంపై నరసిహలపేట మండలం వంతడుపుల, జయపురం, జొజ్జన్నపేటలలో గ్రామసభలు నిర్వహించారు. ఈ సభల్లో డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ పాల్గొని మాట్లాడారు. ఎసీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌తో ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. ఈ గ్రామ సభల్లో వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.