ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అన్నదానం
మునగాల, అక్టోబర్ 8(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో నడిగూడెం మండల పరిధిలోని కేశవాపురం గ్రామానికి చెందిన కాగిత రామచంద్రాపురం సింగిల్ విండో చైర్మన్ గోసుల రాజేష్ వినోద దంపతుల కుమారుడు నందకిషోర్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో పుట్టినరోజు నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేశవపురం గ్రామానికి చెందిన గుజ్జర్లపూడి విజయ్ కుమార్, ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ, నీలమ్మ, షేక్ పాషా తదితరులు పాల్గొన్నారు.