ఇకనైనా తెలంగాణపై స్పష్టంగా మాట్లాడండి

డీఎస్‌కు కోదండరామ్‌ ఉద్బోధ
హైదరాబాద్‌, జూన్‌ 24 (జనంసాక్షి) :
తెలంగాణలోని పది జిల్లాల ప్రజలంతా ప్రత్యేక రాష్ట్ర కోరుతుంటే, సీమాంధ్ర సర్కారు ఉద్యమం, ఉద్యమకారులపై దమనకాండ సాగిస్తున్న ప్రస్తుత తరుణంలోనైనా తెలంగాణపై స్పష్టంగా మాట్లాడాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని డీఎస్‌ నివాసానికి కోదండరామ్‌ సహా జేఏసీ నేతలు వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. తెలంగాణపై ఢల్లీిలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చించారు. రాష్ట్ర విభజనపై హైకమాండ్‌ ఆలోచనలు, ప్యాకేజీ ఇస్తారనే ఊహాగానాలపై చర్చ జరిగినట్లుగా తెలిసింది అయితే, జేఏసీ నేతలు చెప్పినదంతా విన్న డీఎస్‌.. ఢల్లీి పరిణామాలను వెల్లడిరచేందుకు పెద్దగా ఆసక్తి చూపనట్లు సమాచారం. భేటీ ముగిసిన అనంతరం కోదండరామ్‌ విలేకరులతో మాట్లాడారు. ఢల్లీిలో తెలంగాణపై వస్తున్న కదలికల నేపథ్యంలో డీఎస్‌తో సమావశమైనట్లు తెలిపారు. తెలంగాణ అంశంపై ఢల్లీిలో జరుగుతున్న పరిణామాలపై డీఎస్‌తో చర్చించినట్లు చెప్పారు. జేఏసీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలతో ఢల్లీిలో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ జాతీయ సదస్సుపైనా చర్చించామన్నారు. ఈ కార్యక్రమానికి రావాలని డీఎస్‌ను ఆహ్వానించామని తెలిపారు. అయితే డీఎస్‌ తెలంగాణ ఉద్యమంలోకి వస్తాననలేదని, తాము రమ్మనలేదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. తెలంగాణపై గొంతు విప్పాలని మాత్రం కోరామన్నారు.