ఇక ఆ మూడు పార్టీలే లక్ష్యంగా విమర్శలు

ఎన్నికల నాటికి వేడి పెంచేలా టిడిపి వ్యూహాలు

అమరావతి,జూలై11(జ‌నం సాక్షి): విభజన హావిూల అమలు విషయమై కేంద్రంపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని టిడిపి ప్రభుత్వంనిర్ణయించడంతో పాటు తమకు వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తున్న పార్టీలను ఒకే గాటకట్టి విమర్వల దాడిని పెంచాలని టిడిపి నిర్ణయించింది.ఎన్‌డీఏ నుంచి విడిపోయిన నాటి నుంచి బీజేపీపై, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అందివచ్చిన ప్రతి అంశాన్నీ రాజకీయంగా అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు జమిలి ఎన్నికల ప్రస్తావనను కూడా తోసిపుచ్చారు. గతంలో అన్ని ఎన్నికలు ఒకేసారి జరగాలని ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించ డానికి వీలు లేదని చెబుతోంది. ప్రస్తుత లోక్‌సభ ను రద్దు చేసినా తాముఅసెంబ్లీ ఎన్నికలకు సిద్దంగా లేమని కూడా స్పష్టం చేసింది.షెడ్యూల్‌ ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే అభ్యంతరం లేదని అనడం విచిత్రంగానే అనిపిస్తుంది. నిజానికి 2014లో తెలుగు రాష్‌ఆరలకు, లోక్‌భకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యంకాదని జాతీయ న్యాయ కమిషన్‌కు ఆ పార్టీ తెలియచేసింది. ఒకవేళ అలా వెళ్లాలంటే రాజ్యాంగం, దాంతోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుందని గుర్తుచేసింది. అవి చేసి ఎన్నికలకు వెళ్లినా ప్రజా ప్రభుత్వాలు అయిదేళ్లపాటు పూర్తికాలం పదవిలో ఉండటానికి ఏమైనా గ్యారెంటీ ఉంటుందా? అని ప్రశ్నించింది. ముందుగా ఐదేళ్ల గ్యారెంటీ అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. రాజకీయ సంక్లిష్టతలున్న ఈ దేశంలో అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం అసాధ్యమని పేర్కొంది. ఒకవేళ అలా వెళ్లినాఓటర్లలో విశ్వాసం కల్పించడానికి అన్ని ఈవీఎంలకు తప్పనిసరిగా వీవీప్యాట్‌లు అనుసంధానం చేయాలని, అది చేయలేనప్పుడు బ్యాలెట్‌ విధానం ద్వారా ఎన్నికలు నిర్వహించాలని టిడిపి అభిప్రాయపడింది. ఇకపోతఏ రాజకీయంగా పవపన్‌ కళ్యాణ్‌, వైకాపాలు బిజెపి కొమ్ముకాస్తున్నాయన్న నమ్మకంఓల టిడిపి ఉంది. అందుకే అటు కేంద్రాన్ని ఇటి, ఈ రెండు పార్టీలను దుమ్ముదులిపే పనిలో పడింది. ముందునుంచి జగన్‌ చర్యలను విమర్శిస్తున్న టిడిపి తాజాగా ఈ మూడు పార్టీలను ఒకే గాటన కట్టి విమర్శల దాడిని పెంచింది. ఎన్నికల నాటికి దీనిని మరింత తీవ్రస్థాయికి తీసుకుని వెల్లే ప్రయత్నంలో ఉంది. అందుకేజనసేన అదినేత పవన్‌ కళ్యాణ్‌ భ్రమలలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. తెలుగుదేశం పార్టీని తానే గెలిపించానన్న భ్రమలలో పవన్‌ కళ్యాణ్‌ ఉన్నారని మంత్రి గంటా తాజాగా వ్యాఖ్యానించారు. బిజెపి మాటలనే పవన్‌ కళ్యాణ్‌ కూడా చెబుతున్నారని ఆయన ఆరోపించారు. అవాస్తవాలను పవన్‌ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రైల్వేజోన్‌, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ ఇలా ప్రతి అంశంలోనూ తెలుగుదేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్న పవన్‌… మోదీ, అమిత్‌ షాను ప్రశ్నించడానికి మాత్రం సాహసం చేయలేకపోతున్నారని, అంటే బిజెపి మౌత్‌పీస్‌గా పవన్‌ కళ్‌ఆయణ్‌ ఉన్నారని గంటా అన్నారు.