ఇచ్చిన హావిూలను మరచిన టిఆర్ఎస్
హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌నే గెలిపించాలి
కరీంనగర్,అక్టోబర్2 జనం సాక్షి : తెలంగాణ కోసం కేటీఆర్ చేసిన పోరాటమేమిటో,ఏ జైళ్లో ఉన్నాడో, ఎన్ని కేసులు నమోదయ్యాయో వెల్లడిరచాలని డిసిసి అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యాఆనారాయణ డిమాండ్ చేశారు. నిరుద్యోగులను దగా చేసిన చరిత్ర కేసీఆర్‌ది అని, రాష్టాన్న్రి అప్పుల ఊబిలోకి దించాడని, అసెంబ్లీ సాక్షిగా లక్షా లక్ష వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హావిూని మరిచారా అని దుయ్యబట్టారు. ఇంటికో ఉద్యోగం అంటూ ఊదరగొట్టి ఇప్పుడు అలా తాను అనలేదని అనడం ఆయనకే చెల్లిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు హావిూలుగానే మారాయని, మిషన్ భగీరథ కాసుల కక్కుర్తికే పెట్టారని, ఎస్సీ, ఎస్టీల 12 శాతం రిజర్వేషన్ అటకెక్కిందని అన్నారు. హావిూలను మరచి విమర్శిస్తే ఊరుకునేది లేదని, కేసీఆర్‌కు ఓటమి తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో జిల్లాలో శాతవాహన యూనివర్సిటీ, వెటర్నరీ కళాశాల, జేఎన్టీయూ రెండు కళాశాలలు, 50 మోడల్ స్కూళ్లు, పాస్‌పోర్టు కేంద్రం, కేజీబీవీ పాఠశాలలు ఏర్పాటు చేశామని అన్నారు. అయితే టిఆర్ఎస్ హయాంలో ఈ నాలుగేళ్లలో శాతవాహన యూనివర్సిటీకి వీసీని నియమించలేని దుస్థితి ఏర్పడిరదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలోనే ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, అప్పర్‌మానేరు, వరదకాలువ ప్రాజెక్టుల పనులు పూర్తి దశకు చేరుకున్నాయని, ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేసిన పాపాన టీఆర్ఎస్ లేదని అన్నారు. ఇవన్నీ గమనించి ప్రజలు రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు.