ఇదే చివరి అవకాశం

1

జాగాలను క్రమబద్ధీకరించుకోండి
90 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తాం : సిఎం కేసీఆర్‌
హైదరాబాద్‌,జనవరి5(జనంసాక్షి): భూములు, నిర్మాణాల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమని, అక్రమ నిర్మాణాలను వెంటనే క్రమబద్ధీకరించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. క్రమబద్ధీకరణ ఉత్తర్వు విడుదలైన 20 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని, 90 రోజుల్లో క్రమబద్ధీకరణ పక్రియ పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. ఏప్రిల్‌ లోగా క్రమబద్ధీకరణ పక్రియ పూర్తవుతుందని, క్రమబద్ధీకరించుకోని వారిని ఆక్రమణదారులుగానే పరిగణిస్తామని ఆయన తెలిపారు. ఇకముందు రాష్ట్రంలో ఎక్కడా భూ ఆక్రమణకు వీల్లేకుండా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పూర్తిస్థాయి ప్రక్షాళనకే క్రమబద్ధీకరణ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలిపారు. మరోమారు ఇలాంటి క్రమబద్ధీకరణకు అవకాశం ఉండబోదన్నారు. దరఖాస్తు చేసుకోని స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, అవసరమైతే పీడీ చట్టాన్ని ప్రయోగిస్తామని ఆయన తెలిపారు. పేదట భూముల క్రమబద్దీకరణ, ఇతర నిర్మాణాల క్రమబద్దీకరణపై సచివాలయంలో సిఎం సవిూక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, రెవెన్యూ శాఖ కార్యదర్శి విూనా తదితరులతో సవిూక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… క్రమబద్దీకరణకు ఇదే చివరి అవకాశం. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకుని క్రమబద్దీకరించుకోవాలని సీఎం సూచించారు. . క్రమబద్దీకరించుకోని వారిని ఆక్రమణదారులుగానే పరిగణిసామని తేల్చి చెప్పారు. . ఆక్రమణదారుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, అవసరమైతే పీడీ యాక్ట్‌ కూడా ప్రయోగిస్తామని సీఎం హెచ్చరించారు. 90 రోజుల్లో క్రమబద్దీకరణ పూర్తి చేస్తామని, తెలంగాణలో ఇంచు భూమి కూడా కబ్జా కావడానికి వీలు లేదని తెలిపారు. ప్రభుత్వ భూమి ఎవరు ఆక్రమించినా వారిని కబ్జాదారులుగా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దరఖాస్తు చేసుకోని స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. రాష్ట్రంలోని ప్రతి ఇంచు భూమికి టైటిల్‌ ఉండాలని పేర్కొన్నారు.  ప్రభుత్వ భూములను ఆక్రమించి భవనాలు కట్టుకున్న వారు వాటిని రెగ్యులరైజ్‌ చేయించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని  పిలుపు నిచ్చారు. ఆక్రమణలకు తావులేకుండా పూర్తి స్థాయి ప్రక్షాళన జరగడం కోసమే ప్రభుత్వం క్రమబద్దీకరణ నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. క్రమబద్దీకరణకు ఇదేచివరి అవకాశమని, నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకుని క్రమబద్దీకరించుకోని వారిని ఆక్రమణదారులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. అలాంటి ఆక్రమణ దారుల పట్ల ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, పీడి యాక్టు కూడా ప్రయోగించడానికి వెనకాడదని వివరించారు. 125 గజాల వరకు ప్రభుత్వ భూమిలో పేదలు ఆక్రమించుకోని నివాసాలు ఏర్పాటు చేసుకుంటే ఉచితంగానే క్రమబద్దీకరణ చేయాలని నిర్ణయించినందున, అలాంటి వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. మిగతా వారి విషయంలో కూడా ఎంత విస్తీర్ణానికి ఎంత ధర చెల్లించాలో కూడా నిర్ణయించినందున సదరు వ్యక్తులు కూడా  సంబంధిత దరఖాస్తులు వెంటనే సమర్పించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూముల దురాక్రమణకు చరమగీతం పాడాలని, భూముల రిజిస్టేష్రన్లన్ని కూడా సక్రమంగా ఉండాలని, మొత్తంగా భూముల వ్యవహారంలో ప్రక్షాళన జరగాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. గత నెల 31ననే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. మొత్తంగా ఈ ప్రక్రియ అంతా ఏప్రిల్‌ మాసం వరకు పూర్తవుతుందని చెప్పారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా ఇంచు భూమి కూడా దురాక్రమణ జరగాడానికి వీలు లేకుండా కఠినంగా వ్యవహరిస్తమన్నారు. ప్రభుత్వం ఎంతో ఉదారతతో క్రమబద్దీకరణ కోసం అవకాశం కల్పించిందని, దీనిని కూడా ఉపయోగించుకోకుండా అక్రమ కబ్జాలు కొనసాగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని చెప్పారు.