ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నిరంజన్‌రెడ్డి ఘన విజయం

` మరోసారి జనంలోకి ‘జనంసాక్షి’
` కొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు
` ప్రజానాడి పసిగట్టే పనిలో ‘జనంసాక్షి’ సర్వే
` ఈ నెల 11 నుండి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగింపు
` వనపర్తి నియోజకవర్గంలో మొదటిదఫా పూర్తి
` సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్‌ఎస్‌ కు 46 ` 49 శాతం ప్రజామద్దతు
` కాంగ్రెస్‌ కు 26 ` 30 శాతం, బీజేపీకి 22 ` 24 శాతం, బిఎస్పీకి 3 ` 5 శాతం ప్రజామద్దతు
హైదరాబాద్‌ (జనంసాక్షి): ఎన్నికల సర్వేలకు పెట్టింది పేరు ‘జనంసాక్షి’ అని ఆత్మీయ పాఠకులు అందరికీ తెలిసిందే. మరికొద్ది నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యములో మరోసారి విూ ‘జనంసాక్షి’ తనకుతానే పరీక్షించుకోవడానికి జనంలోకి వస్తోంది. ఎండలు, వానల గురించి భయపడకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రజానాడిని పసిగట్టాలని జనంసాక్షి నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే వనపర్తి నియోజకవర్గంలో మొదటిదఫా సర్వే పూర్తి చేసుకున్న జనంసాక్షి బృందం ఈ నెల 11 నుండి రాష్ట్రవ్యాప్త సర్వేను కొనసాగించడానికి సిద్ధం అయింది. ఈనెల పదకొండో తేదీన ప్రారంభం అవుతున్న జనంసాక్షి ఎన్నికల సర్వే 31వ తేదీ వరకు జరుగుతుంది. ఈనెల 11న సిద్ధిపేట నుండి ప్రారంభమై వరుసగా సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, ఉమ్మడి వరంగల్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట్‌, భువనగిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌, ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ లో ముగుస్తుంది. కాగా ఏప్రిల్‌ చివరివారంలో వనపర్తి నియోజకవర్గంలో నిర్వహించిన ‘జనంసాక్షి’ సర్వేలో సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్‌ఎస్‌ కు 46 నుంచి 49 శాతం ప్రజామద్దతు  లభించింది. తరువాత స్థానాల్లో 26 నుంచి 30 శాతంతో కాంగ్రెస్‌, 22 నుంచి 24 శాతంతో బీజేపీ, 3 నుంచి 5 శాతంతో బిఎస్పీ ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు శాతం ఓట్లు కూడా తెచ్చుకోని బీజేపీకి ఇప్పుడు ఇరవైరెండు శాతం ప్రజామద్దతు లభించడాన్ని విశేషంగానే చెప్పుకోవచ్చు.