ఇప్లూలో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంగ్లీష్‌ ఫారిస్‌ లాంగ్వేజ్‌ యూనివర్శిటీ (ఇప్లూ)లో తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడులోకి మధురై ప్రాంతానికి చెందిన మొయినుద్దీన్‌ (30) ఇప్లూలో ఆరబిక్‌ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున యూనివర్శిటీలోని మసీదు సమీపంలో ఉరేసుకుని అత్మహత్యకు చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని, జీవితంపై విరక్తితోనే అత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్‌నోడ్‌లో పేర్కొన్నాడు.