ఇరాక్‌లో బాంబు పేలుళ్లు 22 మంది మృతి
బాగ్దాద్ : ఇరాక్ మరోసారి రక్తమోడింది. వివిద ప్రాంతాల్లో ముష్కరులు జరిపిన బాంబు దాడుల్లో 22 మందికిపైగా మృతి చెందారు. 80 మందికిపైగా గాయపడ్డారు. బాగ్డాద్, ముస్సేఇబ్, హిల్లా, కిర్కుక్ , దియాల ప్రాంతాల్లో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. షియా వర్గం భద్రతాసిబ్బంది.లక్ష్యంగా దుండగులు దాడులకు పాల్పడ్డట్లు అక్కడి అధికార వర్గాలు తెలిపాయి.