ఇరాన్‌లో హెలికాప్టర్‌ కూలి 10 మంది మృతి

టెహ్రాన్‌: ఒక కారు ప్రమాదంలో గాయపడిన వారందరినీ త్వరగా ఆస్పత్రికి చేర్చే ప్రయత్నం నిష్బంలమైంది. క్షతగాత్రులను తీసుకెళ్తున్న హెలికాఫ్టర్‌ కుప్పకూలడంతో అందులో ఉన్న 10 మందీ కన్నుమూశారు. ఇరాన్‌ ఉత్తర ప్రాంతంలో కారు ప్రమాదంలో గాయపడిన వారిని తీసుకుని ఈ విమానం మషాద్‌ అనే నగరానికి వెళ్తోంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ కరెంట్‌ వైర్లకు తగలడంతో కుప్పకూలింది. అందులో ఉన్న 10 మంది అక్కడికక్కడే మరణించినట్లు వార్తాసంస్థలు పేర్కొన్నాయి.