*ఈడీ కేసులను ఉపసంహరించుకోవాలి.

* గూట్ల తిరుపతి.
 చిట్యాల22( జనం సాక్షి) నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి అన్నారు. ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి  మాట్లాడుతూ దేశం కోసం రాజీవ్ గాంధీ,ఇందిరా గాంధీ ప్రాణాలను సైతం త్యాగం చేశారు.గత ఎనిమిదేళ్లుగా దేశంలో ప్రతిపక్షాన్ని అంతమొందించడమే లక్ష్యంగా సామాన్యుల తరపున ప్రశ్నించే గొంతులను నొక్కడమే ధ్యేయంగా మోడీ సర్కారు పని చేస్తోంది. ఆ అరాచకానికి పరాకాష్ఠి, సోనియమ్మను ఈడీ ముందుకు పిలిపించడం ఈ దేశంలో ప్రజలను, వాళ్ల హక్కులను, ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలో కాంగ్రెస్ పార్టీ కి తెలుసు. మోడీ దుశ్చర్యలను ప్రజాకోర్టులో ఎండగడతాం.
ఈడి కేసులు పెట్టి మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అనగదొక్కే, కుట్రపూరితమైన విష రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం వెంటనే మా నాయకులపై పెట్టిన ఈడీ కేసులను వెంటనే  ఎత్తివేయాలి. దేశంలో రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను రానున్న రోజుల్లో బిజెపి,టిఆర్ఎస్ పార్టీలకు ప్రజలు గోరి కట్టక తప్పదని, వీరి యొక్క ఈడి అక్రమ కేసులతో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ఇప్పటికైనా మా నాయకుల పై పెట్టిన ఈడీ కేసులను వెంటనే ఉపసంహరించుకొని ప్రజాక్షేత్రంలో క్షమాపణ చెప్పాలని లేకుంటే ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి,ఇప్పకాయల నర్సయ్య,జిల్లా నాయకులు చిలుకల రాయకొంరు,దొడ్డి కిష్టయ్య,పట్టణ అధ్యక్షులు సాంబశివరావు, దబ్బెట అనిల్,బుర్ర శ్రీనివాస్,బుర్ర రఘు,ధబ్బెట రవి,నెరెళ్ళ సమ్మయ్య, జన్నె నరేష్,సరిగొమ్ముల కుమార్,బండి భగవాన్,కొంపెల్లి శ్రీకాంత్,కంచర్ల రాంబాబు, కుమారస్వామి,కేతిరి అశోక్, తదితరులు పాల్గొన్నారు..
Attachments area