ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ

ఏడు కోట్ల కుటుంబాలను పేదరికం నుంచి విముక్తం చేస్తాం : సోనియా
న్యూఢల్లీి, జూన్‌ 3 (జనంసాక్షి) :
ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అన్నారు. రానున్న పదేళ్లలో ఏడు కోట్ల కుటుంబాలను దారిద్య్రం నుంచి బయటపడేస్తామని  ప్రకటించారు. హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ సహా ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. సోమవారం ఢల్లీిలో జరిగిన అజీవిక దివాస్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోనియా ప్రసంగించారు. ‘రాబోయే పదేళ్లలో ఏడు వేల కోట్ల కుటుంబాలకు పేదరికం నుంచి విముక్తి కల్పిస్తాం. అయితే, అది అనుకున్నంత సులువు కాదు’ అని అన్నారు. అజీవిక పథకం (నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌) సామాజిక, ఆర్థిక మార్పులను తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఈ కార్యక్రమం ద్వారా జమ్మూకాశ్మీర్‌లో మహిళలకు సాయం చేస్తుండడం ఆనందం కలిగిస్తోందన్నారు. గ్రావిూణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అజీవిక మిషన్‌ను దేశవ్యాప్తంగా ప్రధానంగా మధ్య, ఈశాన్య రాష్టాల్ల్రో వీలైనంత త్వరగా అమలు చేస్తామన్నారు. ఏడాది కాలంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలతో పాటు ఐదు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఈ నూతన పథకం గట్టెక్కిస్తుందని సోనియా భావిస్తున్నారు.బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు స్వయం సాధికారత కల్పించడమే యూపీఏ ప్రభుత్వం లక్ష్యమని సోనియా చెప్పారు. ‘అజీవిక కార్యక్రమం గణనీయ మార్పులు తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా మహిళా స్వయం సహాయక బృందాల చేయూతతో అనేక రాష్టాల్ల్రోని గ్రావిూణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక మార్పులు వచ్చాయని’ తెలిపారు. ఈ విజయంతో దేశంలోని మిగతా ప్రాంతాల్లో ప్రధానంగా ఈశాన్య రాష్టాల్ల్రో వీలైనంత త్వరగా అజీవిక మిషన్‌ను అమలుచేయాలని కోరారు. ప్రపంచంలో భారత్‌ మినహా ఏ దేశం కూడా ఇంత పెద్ద స్థాయిలో మహిళలకు సాధికారిత కల్పించలేదన్నారు. ‘ఈ కార్యక్రమం వల్ల మహిళలు పేదరికం నుంచి విముక్తి పొందుతున్నారు. ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందుతున్నారని’ తెలిపారు. మహిళలు, బడుగు బలహీన వర్గాలను ఆర్థికంగా పరిపుష్టి చేయడంపైనే యూపీఏ దృష్టి సారించిందన్నారు. మహిళలు పేదరికంతో పాటు సామాజిక కట్టుబాట్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ప్రధానంగా మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందన్నారు.