ఈ కార్ రేసులో ఏ1గా కేటీఆర్
` ఎ2గా అర్వింద్ కుమార్
` రేసింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ నేతకు బిగుస్తున్న ఉచ్చు
` రూ.55 కోట్ల అవినీతిపై ఏసీబీ కేసు నమోదు
హైదరాబాద్(జనంసాక్షి):ఎట్టకేలకు కెటిఆర్ మెడకు ఈ కార్ రేసింగ్ అవినీతి ఉచ్చు బిగుసుకుంటోంది. దీనిపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేసిన కెటిఆర్‌పై కేసు నమోదు అయ్యింది. ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో తదుపరి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. అందులో భాగంగా ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాల్సిందిగా అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి మంగళవారం లేఖ రాశారు. ఫార్ములా రేసు పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్‌బీఐ అనుమతి లేకుండా రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో కేటీఆర్‌తోపాటు పురపాలకశాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను,
చీఫ్ ఇంజినీర్‌ను బాధ్యులుగా పేర్కొన్నారు. అధికారులపై విచారణకు ప్రభుత్వం ఇంతకుముందే అనుమతి ఇచ్చింది. కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్ నుంచి అనుమతి కోరగా, సుమారు నెల రోజుల తర్వాత ఇటీవల అనుమతి లభించింది. దీంతో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది.ఫార్ములా-ఈ ఆపరేషన్స్, ఎస్ నెక్ట్స్ జెన్, పురపాలకశాఖల మధ్య 9, 10, 11, 12వ సీజన్ల కార్ రేస్‌లు నిర్వహించేలా ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెª`లకెస్‌రోడ్డులో తొమ్మిదో సీజన్ రేసింగ్ నిర్వహించారు. ‘అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదంతోనే ఒప్పందం కుదిరింది. శాఖాధిపతిగా ఎంవోయూ చేశా‘ అని ఒప్పందంపై ఐఏఎస్ అర్వింద్ కుమార్ సీఎస్‌కు సమాధానమిచ్చారు. ఈ రేసు నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్‌ఎండీఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా రూ.55 కోట్లు చెల్లించడం వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా రూ.46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం. వీటన్నింటిపైనా అనిశా దర్యాప్తు చేయనుంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు భావించిన, అనుమానించిన వారందరికీ ఏసీబీ నోటీసులు ఇవ్వనుంది. వారిని విచారించి, వాంగ్మూలాలను నమోదు చేస్తుంది. అధికార దుర్వినియోగం జరిగినట్లు తేలితే సంబంధిత ఆధారాలను సేకరిస్తుంది. ముఖ్యంగా ఇందులో నిధుల మళ్లింపు కోణం ఏమైనా ఉందా…? అనే అంశంపై ఎసిబి ఎక్కువ దృష్టి సారించనుంది. ఫార్ములా సంస్థకు చెల్లించిన రూ.55 కోట్లు ఎక్కడెక్కడి నుంచి చివరికి ఎవరి ఖాతాలోకి వెళ్లాయనే కోణంలోనూ పరిశీలించే అవకాశముంది. ఫార్ములా-ఈ రేస్ నిర్వహించిన సంస్థలకు సైతం నోటీసులు జారీ చేయడానికి అవకాశముంది. అధికార దుర్వినియోగంపై ప్రాథమిక ఆధారాలు లభిస్తే… అందుకు బాధ్యులైన వారి అరెస్టు తప్పకపోవచ్చు. అదే జరిగితే మున్ముందు ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారం సంచలనాత్మకంగా మారుతుందని భావిస్తున్నారు. 2023, ఫిబ్రవరి 11న ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ చుట్టూ దాదాపు 2.8 కిలోవిూటర్ల ఈ కార్ రేసింగ్ పెట్టింది. అయితే ఈ కార్ రేసింగ్ వ్యవహారినికి సంబంధించి దాదాపు రూ.55 కోట్ల వరకు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా సంబంధిత డిపార్ట్‌మెంట్ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీకి నిధులు విడుదలయ్యాయి. అయితే రూ.55 కోట్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, నిధుల దుర్వినియోగం జరిగాయని ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ నిధుల గోల్‌మాల్‌పై విచారణకు సర్కార్ ఆదేశించింది. ఆర్థికశాఖ అనుమతులకు సంబంధించి ఎక్కడా రికార్డ్స్‌లో లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. విదేశీ కంపెనీలకు ఇంత భారీ మొత్తాన్ని ఎలాంటి అనుమతులు లేకండా ఏ విధంగా అప్పగించారని దానిపై స్పష్టత లేకుండాపోయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఉద్యమ కారులం .. కేసులకు భయపడం
` బరాబర్ చెబుతున్నా.. నేను ఏ తప్పు చేయలేదు : కేటీర్
హైదరాబాద్ : ఫార్ములా ఈ రేసింగ్ ప్రమోటర్లు గతేడాది డిసెంబర్ 13న సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. వచ్చే మూడేండ్లు రేసింగ్ నిర్వహిస్తామంటూ దాన కిశోర్‌కు ఆల్బర్టో లేఖ రాశారు. మరోసారి నిర్వహణపై డిసెంబర్ 21 లోపు స్పష్టత ఇవ్వాలని మెయిల్ పెట్టారు. రేసింగ్ రద్దు అయిపోగానే ఎఫ్‌ఎంఎస్ వాళ్లు రూ. 74 లక్షలు చెల్లించారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాచి పెడుతుందని కేటీఆర్ తెలిపారు.మరి ఇందులో కరప్షన్ ఎక్కుందో చెప్పాలి రేవంత్ రెడ్డి. ఏం కేసు ఇది.. మా విూద కేసులు పెట్టి సతాయిస్తాం అంటే.. ఒక్కటి చెబెతున్నాం.. ఉద్యమ నాయకుడి బిడ్డలం సైనికులు.. నీలాంటి చిల్లర కేసులకు భయపడేటోడు ఎవరూ లేరు. ఏం చేసుకుంటావో చేస్కో. రేవంత్ సర్కార్, ఫార్ములా ఈ మధ్య జరిగిన ప్రత్యుత్తరాలకు సంబంధించిన కాపీలన్నీ ఏసీబీ, పోలీసులు, కోర్టుకు ఇస్తాను. నేను ఏ తప్పు చేయలేదు. బరాబర్ చెబుతున్నా.. తప్పు చేయలేదు.. ఆత్మ విశ్వాసం ఎక్కువ. ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.అమృత్ స్కాం, మూసీ లూటీ, రేవంత్ రెడ్డి అన్నదమ్ముళ్ల అరాచకాలను ఢల్లీి స్థాయిలో ఎక్సోపోజ్ చేస్తున్నాం.. కాబట్టి కడుపు మంటతో చేస్తున్నావ్.. అయినా ఏం భయపడం.. ఏం చేసుకుంటావో చేసుకో. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి రేస్ నిర్వహించాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫార్ములా ఈ వారు ఉత్తరం రాశారు. లైసెన్స్ ఫీజు వాస్ తీసుకోమని లేఖలు రాశారు. అవి దాచిపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు చెప్పడం లేదు. అన్నింటికి మించి ఫార్ములా ఈ వాళ్లు ఆర్బిట్రేషన్ ద్వారా కొట్లాడుతున్నారు. వాళ్ల విూద కేసు వేస్తే ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఇజ్జత్ పోదా..? అని కేటీఆర్ నిలదీశారు.కేసు పెట్టదలచుకుంటే పెట్టుకో.. కానీ తెలంగాణ పరువు తీయకు. మేం భయపడం.. లీగల్ గా ఎదుర్కొంటాం.. ఎలాంటి పరిస్థితిని అయినా శాంతియుతంగా ఎదుర్కొంటాం. ఉద్యమాన్ని ప్రజాస్వామికంగా శాంతియుతంగా నడిపాం. రేవంత్ రెడ్డి చిల్లర ఎత్తుగడలకు పడిపోం. 100 శాతం శాంతియుతంగా ముందుకు వెళ్తాం. ఎన్ని డైవర్షన్ గేమ్స్ ఆడినా.. హావిూలు అమలు చేసేదాకా సీఎం రేవంత్ రెడ్డిని వదిలిపెట్టం అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శాసనసభలో చర్చ పెట్టాలి
ఫార్ములా`ఈ కార్ రేస్‌లో ఏసీబీ కేసు నమోదుపై మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ‘’ఫార్ములా`ఈ రేస్‌లో కుంభకోణం జరిగిందని అంటున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై శాసనసభలో చర్చ పెట్టాలి. ఫార్ములా`ఈ కార్ రేస్‌పై అన్ని వాస్తవాలు వివరిస్తా’’ అని ప్రకటించారు. ఫార్ములా`ఈ కార్ రేస్‌కు సంబంధించిన కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్‌పై కేసు అంశంపై భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రస్తావించారు. ‘’ప్రశ్నిస్తే దబాయిస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. కేటీఆర్ విూద అక్రమ కేసులు పెడుతున్నారు. రాష్ట్ర ఇమేజ్ కోసం ప్రయత్నిస్తే కేసులు పెట్టారు’’ అని హరీశ్‌రావు ఆరోపించారు.