ఈ నెల 12న ఛలో అసెంబ్లీ

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి సీఎం  కెసిఆర్  నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం జాబ్  క్యాలెండర్ ప్రకటించకుండా , కాలయాపన చేస్తూ నిరుద్యోగ యువతను మోసం చేస్తుందని తెలంగాణ యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నారబోయిన కిరణ్ విమర్శించారు.ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని , నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న తెలంగాణ విద్యార్ధి యువజన సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఛలో అసెంబ్లీని విజయవంతం చేయాలని కోరుతూ స్ధానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆ కార్యక్రమ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.పేద , మధ్య తరగతి విద్యార్థులుండే సంక్షేమ హాస్టల్స్, గురుకుల హాస్టళ్లను ప్రభుత్వము పట్టించుకోకపోవడం మూలంగా విద్యార్థులు ఇబ్బందులను  ఏదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ జనసమితి అద్యక్ష , ప్రధాన కార్యదర్శులు బంధన్ నాయక్, పగిల్ల శ్రీను , మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రఫీ , యువజన సమితి పట్టణ అధ్యక్షుడు శివ , ఎస్టీ సెల్ పట్టణ కన్వీనర్ దేవత్ సతీష్ , నాయకులు శివ , అక్తర్ , సుబ్బు , ప్రభు తదితరులు పాల్గొన్నారు.