ఈ నెల 20 నుంచి పల్స్‌ పోలియో కార్యక్రమం

ఆదిలాబాద్‌, జనవరి 4 (): జిల్లాలో చేపట్టే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ పిలుపునిచ్చారు. ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు చేపట్టే పల్స్‌ పోలియో కార్యక్రమానికి కళాజాత బృందాలు, కరపత్రాలు, వాల్‌పోస్టర్‌ ద్వారా విస్తృత ప్రచారాన్ని కల్పించాలనిఆ ఆయన అదేశించారు. గ్రామీణ ప్రాంతాలు గిరిజన గ్రామాలు, పారిశ్రామిక వాడల్లోని ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి పోలీయో చుక్కలను వేయాలని అన్నారు. జిల్లాలకు 5లక్షల 20వేల పోలీయో చుక్కలు అందాయని వాటిని జిల్లాలోని 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో భద్రపరిచామన్నారు. జనవరి 20న 1609 గ్రామీణ ప్రాంతాలు, 950 గిరిజన ప్రాంతాలు, 386 పట్టణ ప్రాంతాలు, 120 సంచార కేంద్రాల ద్వారా, 3,65 బూతులను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 3,50వేల మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించామని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 21,22 తేదీల్లో అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పోలీయో చుక్కల మందులు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వివిధ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు.