*ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి*

రాజానగరం రాజేష్ మాదిగ జిల్లా కన్వీనర్

వీపనగండ్ల 20 (జనంసాక్షి)
మండల కేంద్రంలో బుధవారం నాడు బిజెపి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా దండోరా జిల్లా కన్వీనర్ రాజానగరం రాజేష్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు 100 రోజుల్లో చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి నేటికీ ఆ యొక్క హామీని అమలు చేయకుండా మాదిగలను మోసం చేస్తుంది. ఇకనైనా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ఈ వర్షాకాలం పార్లమెంటు సమావేశాలు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించి మాదిగలకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అని రాజేష్ మాదిగ అన్నారు.
బిజెపి పార్టీ మొట్టమొదటిసారిగా 1996 సంవత్సరంలో కాకినాడ తీర్మానంతో మాదిగలను నమ్మించింది ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సి వర్గీకరణ చట్టబద్ధత కోసం అనుకూలంగా తీర్మానాలు చేయడంతో పాటు అనేక సభలలో కేంద్ర మంత్రులుగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులుగా అనేక సభలు సమావేశాలు ధర్నాలలో పాల్గొని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చేస్తున్న న్యాయమైన సామాజికపరమైన డిమాండ్ కు మందకృష్ణ మాదిగ  అనేక సందర్భాలలో అండగా నిలబడి మద్దతు తెలిపిన పెద్దలు నేడు విస్మరించారు మోసం చేశారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
ఒక నాడు లోక్ సభ ప్రతిపక్ష నాయకురాలిగా శ్రీమతి సుష్మా స్వరాజ్  ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు పార్లమెంట్ లో బిల్లు పెడితే మేము మద్దతు ఇస్తామనేసి యూపీఏ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు.రాజనాధ్ సింగ్ నితిన్ గడ్కారీ  యూపీఏ ప్రభుత్వానికి వర్గీకరణకు అనుకూలంగా లేఖలు రాయడం జరిగింది.ప్రస్తుత కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి  నా చిరకాల కోరిక నేను కార్యకర్తగా ఎస్సీ వర్గీకరణ కోరుకుంటున్నాను.
అందుకు నేను నా శక్తి వంచన లేకుండా వర్గీకరణ సాధన కోసం ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది బిజెపి పార్టీ ఎంతమంది నాయకులు ఎన్ని హామీలు ఇచ్చినా ఇక మీదట బిజెపి పార్టీతో తాడోపేడో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నం అని హెచ్చరిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో
మీసాల నాగరాజు మాదిగ
శిరువటి శ్రీనివాస్ బుడగ జంగాల హక్కుల పోరాట సమితి
రాష్ట్ర నాయకులు
గంధం లక్ష్మయ్య మాదిగ
మంద నరసింహ మాదిగ
ఏడవల్లి భాస్కర్ బుడగ జంగాల హక్కుల పోరాట సమితి
ఉమ్మడి జిల్లా కన్వీనర్
పరుశురాం మాదిగ
కుడికిళ్ళ లక్ష్మణ్ మాదిగ, దేవుని మహేష్ మాదిగ,బి.విష్ణు మాదిగ,బి.విజయ్ మాదిగ,డి.కృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.