ఉచిత వైద్య శిబిరం
దంతాలపల్లి: బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నర్సింహులపేట మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 185 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి రాజు, బాలవికాస నిర్వహకురాలు ఎం.శోభ తదితరులు పాల్గొన్నారు.