ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కార్పొరేటర్

వరంగల్ ఈస్ట్, జూలై 16(జనంసాక్షి ):
            ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా జ్వరాలు రాకుండా ఉండడానికి తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని 42 వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్అన్నారు. శనివారం రోజున రంగశాయిపేటలోని రామాలయం ఎదురుగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని 42 వడివిజన్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ ప్రారంభించారు.
               ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లోని ప్రజలందరూ కూడా ఈ ప్రత్యేక ఉచిత వైద్య శిబిరానికి వచ్చి వైద్య సదుపాయాన్ని పొందాలని కోరారు. తమ తమ ప్రాంతాల్లోని ఇంటి పరిసరాలలో నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వలన డెంగ్యూ మరియు మలేరియా జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని కాబట్టి తమ పరిసరాలలో నీటిని నిల్వంచకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.
          ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్, విజయ్ కుమార్, ఫార్మసిస్టు సతీష్ కుమార్, ఎలుగు సుజాత, ఆశావర్కర్లు శ్రీదేవి, లత, శారద తదితరులు పాల్గొన్నారు.