ఉత్తమ ఫలితాలు సాధించండి : డిఇవో
వరంగల్,ఫిబ్రవరి14(జనంసాక్షి): టెన్త విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారి చంద్రమోహన్ కోరారు. పరీక్షల విధానాల్లో మార్పులు వచ్చాయని, బట్టీ విధానాన్ని విడిచి, అవగాహన చేసుకుంటూ చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరన్నారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. ముందుగాపరీక్షలంటే ఉన్న భయాన్ని విడిచి పెట్టాలన్నారు.పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఉత్తమ ఫళితాలు సాధించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని హెడ్మాస్టర్లకు సూచించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మారాలంటే పిల్లలు కష్టపడి చదవాలన్నారు. పది ఉత్తీర్ణత సాధించిన వారంతా ఉన్నత చదువులు చదవాలని సూచించారు. సమాజంలో ఉన్న ఎన్నో సవాళ్లు ప్రతి సంవత్సరం మారుతుందని అన్నారు. సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా మేధాశక్తిలో మార్పు వల్ల విద్యార్థుల్లో సృజన పెరుగుతుందన్నారు. అందువల్ల విద్యార్థులు ఏకాగ్రత చదువుపై పెట్టి తొలిమెట్టుగా ఉన్నటెన్త్‌లో రాణించాలన్నారు.