-ఉత్తమ విలువలతో కూడినది జర్నలిజం.

వ్యవస్థ లోపాలని గుర్తించిన వారే నిజమైన జర్నలిస్టు.
-ప్రతి జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు,హెల్త్ కార్డులు అందిస్తాం.
-జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తాం.
— రాష్ట్ర పర్యాటక,ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.
-జర్నలిస్టు లకు అండగా ఉంటాం.
పోరాటాల చరిత్ర గలది
టియూడబ్ల్యూజే(ఐజేయూ).
-టియూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి(మహబూబ్ నగర్)ఆగష్టు29(జనంసాక్షి):
జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని రాష్ట్ర పర్యటక, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్నారు.సోమవారం మహబూబ్ గర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం ఆడిటోరియంలో నిర్వహించిన తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయు) ద్వితీయ మహాసభలకు ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జర్నలిజం అనేది ఉత్తమ విలువలతో కూడినదని కొనియాడారు. సురవరం ప్రతాపరెడ్డి లాంటివారు పాత్రికేయ వృత్తిని ముందంజలో నడిపించిన ఘనత మన పాలమూరుకు దక్కిందని అన్నారు.గత 25 సంవత్సరాల నుండీ టియూడబ్యూజే(ఐజేయూ) కు నాకు అవినాభావ సంబంధాలు ఉన్నాయని అన్నారు.ముఖ్యంగా జర్నలిస్టులు ఒక ప్రాంతం విశిష్టత ప్రత్యేకత ను విశ్లేషిస్తూ అభివృద్ధికి తనదైన శైలిలో గుర్తింపు తేవడం గొప్ప విషయం అన్నారు సమాజంలో జర్నలిజంకు చాలా గౌరవం, గుర్తింపు, ఉన్నదని గుర్తు చేశారు. ఒక జర్నలిస్టు అంటే చాలా తెలివితేటలు కలిగి న గొప్ప మేధాశక్తి అని అన్నారు.తెలంగాణలో జర్నలిజం విలువలకే మారు పేరని, అంతేకాకుండా 170 కవులను గుర్తించి పరిచయం చేసిన గొప్ప ఘనత సురవరం ప్రతాపరెడ్డిదని అన్నారు.జర్నలిస్టుల నడవడిక విధానం గౌరవం అధికారులతో ప్రజాప్రతినిధులతో ఒక సమూహంలో కలిసి నడవాల్సిన ఒక గొప్ప ప్రత్యేక గుర్తింపు పొందాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఎలాంటి జీతం లేనప్పటికీ గుర్తింపు కోసం గౌరవం కోసం 99శాతం జర్నలిస్టులు నిరంతరం వ్యవస్థ బాగు కోసం కృషి చేస్తుండడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రతి జర్నలిస్టు భయంతో కాకుండా ప్రేమతో పలకరించే విధంగా వార్తలను సేకరించి గుర్తింపు సాధించాలని సూచించారు. వాస్తవాలు, జరిగింది, స్పష్టతను రాయాల్సి ఉంటుందని, వార్తను కేవలం ఒక వ్యక్తిపై నిరాదారంతో రాయడం వల్ల పరువు నష్టం దావా పలు రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.అలా కాకుండా వ్యవస్థపై లోటుపాట్లపై వార్తను రాయటం వల్ల అభివృద్ధికి వారసులవుతా రని అన్నారు.ఒక వ్యక్తి వల్ల ఒక వ్యవస్థలో మంచి జరగాలని ఆశిస్తున్నాను అని అన్నారు.ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని గుర్తు చేశారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వంతో పని చేయించుకోవాలని అన్నారు ప్రతిపక్షం వహించే బాధ్యత జర్నలిస్టులది అని సూచించారు. ప్రతి జర్నలిస్టుకు నా వంతుగా సహాయ సహకారాలు కచ్చితంగా ఉంటాయని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం 24 గంటల కరెంటు రైతు బీమా రైతు బంధు నాలుగు కోట్ల రూపాయలు గ్రామీణ స్థాయిలో 25 కోట్లు రూపాయలు అందుతున్నాయని అన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్యం పెన్షన్స్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఉమ్మడి జిల్లా బస్సు పాసులు డబుల్ బెడ్ రూములు తదితర సదుపాయాలు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని అన్నారు. గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు 1194 అక్రిడిటేషన్లు ఇవ్వగా ఈ సంవత్సరం 1685 అక్రిటేషన్లు మంజూరు చేయడం జరిగిందన అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.
జిల్లా మహాసభల కు ఆత్మీయ అతిథులుగా హాజరైన టి యు డబ్ల్యూ జే (ఐజెయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ మాట్లాడుతూ టి యు డబ్ల్యూ జే ఐజెయూ గ్రామీణ స్థాయి విలేకరులకు అండదండలుగా నిలుస్తూ అనునిత్యం పాత్రికేయుల సంక్షేమ కోసం పాటు పడుతుందని సూచించారు.అధికార యూనియన్ ప్రలోభాలకు తలొగ్గదని, అందరికీ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని ఇందులో ఎవరిది ఎలాంటి ప్రమేయాలు ఉండవని అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డులు తదితర సంక్షేమ పథకాలు వర్తించేందుకు యూనియన్ నిర్విరామంగా కృషి చేస్తుందని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహకారంతో ప్రభుత్వ నుండి రెండు కోట్ల రూపాయలను మంజూరు చేయించి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ వద్ద యూనియన్ భవనాన్ని నిర్మించేందుకు కృషి చేయడం గర్వించదగ్గ విషయమన్నారు.
ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే (ఐజెయూ) రాష్ట్ర కోశాధికారి రాజేష్ , ద్వితీయ మహాసభలు నిర్వాహకులు సభాధ్యక్షులు దత్తాత్రేయులు,శేఖర్, రామాంజనేయులు, నాగర్ కర్నూల్ జిల్లా నాయకులు కొండకింది మాధవరెడ్డి,చికిరాల పట్టాభి,సందు యాదగిరి,కావలికృష్ణ, సుదర్శన్,ఆయా జిల్లాల నాయకులు పాల్గొన్నారు.