బనకచర్లపై ఏపీని ముందుకెళ్లకుండా కట్టడి చేయండి
` జీఆర్‌ఎంబీకి తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ లేఖ
హైదరాబాద్(జనంసాక్షి):గోదావరి-బనకచర్లపై ఏపీ ముందుకెళ్లకుండా చూడాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ కార్యాలయం లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు, తాడిపూడి ఎత్తిపోతలపై ఎలాంటి టెండర్లు చేపట్టకుండా చూడాలని కోరింది. ‘‘ఈ నెల 7న జరిగిన సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించాం. గోదావరి-బనకచర్ల ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని జీఆర్‌ఎంబీ ఛైర్మన్, ఏపీ సభ్యులు సమాధానం ఇచ్చారు. కానీ, మరుసటి రోజే ఏపీ జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఆలస్యం చేయకుండా తక్షణమే ఏపీని నిలువరించాలి’’అని లేఖలో పేర్కొంది.