విద్యాహక్కు చట్టం అమలు పురోగతిపై అఫిడవిట్‌ దాఖలు దాఖలు చేయండి

` ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
` తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా
హైదరాబాద్‌(జనంసాక్షి):విద్యాహక్కు చట్టం అమలుపై దాఖలైన పిల్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలోని ప్రైవేటు- పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు చేయాలని సామాజిక కార్యకర్త తాండవ యోగేశ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్‌టీఈ వచ్చి 16 ఏళ్లు గడుస్తున్నా విద్యార్థులకు అందుబాటులోకి రాలేదని తెలిపారు. దేశంలోని చాలా రాష్టాల్ల్రో ఇప్పటికే విద్యాహక్కు చట్టం అమలులో ఉందని గుర్తుచేశారు. దీని ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేటు- పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. మరోవైపు గతేడాది అక్టోబర్‌లో విద్యాహక్కు చట్టంపై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తెస్తామని అందులో పేర్కొంది. దీని అమలుకు సంబంధించిన పురోగతిపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీజే ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.