ఉద్యమ కార్యాచరణపై చర్చించనున్న ఐకాస
హైదరాబాద్: తెలంగాణ ఐకాస స్టీరింగ్ కమిటీ ఈ మధ్యాహ్నం టీఎన్జీవో భవన్‌లో భేటీ కానుంది. తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి షిండే వెల్లడించిన నేపథ్యంలో నెల రోజులపాటు అనుసరించాల్సిన ఉద్యమ కార్యాచరణపై ఐకాస నేతలు చర్చించనున్నారు.