ఉన్నత లక్ష్యాలను సాధించాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని డీఐఈఓ రుద్రంగి రవి అన్నారు.గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ పెరుమాళ్ళ యాదయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో  ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను అభినందించి, ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడం అభినందనీయమన్నారు.కళాశాల ప్రిన్సిపాల్,అధ్యాపకులను ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం కళాశాల ప్రిన్సిపల్ యాదయ్య మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు వచ్చి, క్రమశిక్షణతో విద్యానభ్యసించి, అధ్యాపకుల సూచనలను పాటిస్తే ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని పేర్కొన్నారు.రాష్ట్రస్థాయి మార్కులు సాధించిన కొమ్ము ప్రశాంతికి కళాశాల ప్రిన్సిపల్ యాదయ్య ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో జిజెఎల్ఎ అధ్యక్షులు మద్దే మడుగు సైదులు , కవిత , లింగం , నిరంజన్ రెడ్డి , కంది శ్రీనివాస్ , లైబ్రేరియన్ వీరయ్య , వసంత లక్ష్మి , శ్రీనివాస్, వెంకటరాములు, ప్రతాప్ , రమేష్, కృష్ణా అరవింద, లక్ష్మయ్య, రాణి ,పున్నమ్మ , భాస్కర్, రవీందర్, జ్యోతి, కుమార్, రమేష్, సంధ్య, చైతన్య, పవన్, స్వాతి, సతీష్, దయాకర్, శ్యాంసుందర్ రెడ్డి, ప్రవీణ్, ఆరిఫ్ బేగం, లతీఫ్ , లక్ష్మయ్య, రాములు ,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.