ఉపాధిహామీ అధికారులను నిర్భందించిన గ్రామస్థులు
మద్దూరు: మండలంలోని కొండాపూర్‌లో గత ఏడాది ఉపాధి హామీ బిల్లులను ఇంతవరకూ చెల్లించనందుకు నిరసనగా అధికారులు, సామాజిక తనిఖీ బృందాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్థులు నిర్భందించారు. గతంలో జరిగిన సామాజిక తనిఖీల్లో ఈ విషయంపై ఫిర్యాదు చేసినా బిల్లులు చెల్లించకపోవడంపై కూలీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులకు విన్నవించి బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని ఏపీఓ మాధవి హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు.