ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం జరిగిన ఆ సంఘ సమావేశంలో ఆయన పొల్గొని మాట్లాడారు.సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినాన్ని పాటించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు.బదిలీలు, పదోన్నతుల సాధనకై సెప్టెంబర్ 4న జిల్లా కేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని, సెప్టెంబర్ 11 నుండి సామూహిక నిరాహార దీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు.2020 నూతన జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని కోరారు.మోడల్ స్కూల్లో, రెసిడెన్షియల్ పాఠశాలలోని సిబ్బందికి ఆరోగ్య కార్డులను మంజూరు చేయాలని ,317 జీవో వల్ల నష్టపోయిన స్పౌజ్ కేసులకు న్యాయం చేయాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు హామీ ఇచ్చిన విధంగా గౌరవ వేతనం అందించాలని ,పాఠశాలలో స్వచ్ఛ కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జిల్లా జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి సోమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి ,అరుణ భారతి, జిల్లా కోశాధికారి వెంకటయ్య, జిల్లా కార్యదర్శులు సయ్యద్, యాకయ్య , వీరారెడ్డి, దామోదర్,పాపిరెడ్డి ,రమేష్, అనిల్ కుమార్, రమేష్, లాలు, క్రాంతి ప్రభ,శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.