ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

ఫలితాలు మార్పునకు సంకేతం : లాలూ
బెంగాల్‌లో తృణమూల్‌
బీహార్‌లో ఆర్జేడీ
గుజరాత్‌లో భాజపా గెలుపు
న్యూఢల్లీి, జూన్‌ 5 (జనంసాక్షి) :
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల్లో మౌరా నుంచి పోటీ చేసిన తృణమూల్‌ కాంగ్రెసు అభ్యర్థి ప్రసూన్‌ బెనర్జీ విజయం సాధించారు. ఉత్తర ప్రదేశ్‌లోని హండియా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి ప్రశాంత్‌ సింగ్‌ గెలుపొందారు. బీహార్‌ ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు షాక్‌ ఇచ్చాయి. 2014 సాధారణ ఎన్నికలకు ముందు జెడి(యు) ప్రభుత్వానికి లాలూ ప్రసాద్‌ ఆధ్వర్యంలోని రాష్టీయ్ర జనతా దళ్‌(ఆర్జెడి) గట్టి షాక్‌ ఇచ్చింది. మహారాజ్‌గంజ్‌ లోకసభ స్థానాన్ని ఆర్జేడీ కైవసం చేసుకుంది. జెడి(యు) అభ్యర్థి పికె షాలిని ఆర్జెడి అభ్యర్థి ప్రభుసింగ్‌ ఓడిరచారు. గుజరాత్‌లో జరిగిన రెండు పార్లమెంట్‌, నాలుగు అసెంబ్లీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. పోరుబందర్‌, బనస్కంత పార్లమెంటు స్థానాలను అధికార భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. నాలుగు అసెంబ్లీ స్థానాలను కూడా బీపేజీ గెలుచుకుంది. ఉప ఎన్నికల ఫలితాలపై నరేంద్ర మోడీ స్పందించారు. అంతర్గత భద్రత పైన కేంద్రం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉప ఎన్నికలలో బిజెపి గెలుపు కేంద్రానికి ఓ హెచ్చరిక అన్నారు. కాంగ్రెసు అధ్వాన పాలనకు ఈ ఉప ఎన్నికలు నిదర్శనమన్నారు. ఎన్నికల ఫలితాల రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ ఘాటుగా స్పందించారు. బీహార్‌లో మార్పును కోరుకుంటూ ప్రజలిచ్చిన తీర్పు ఇది అని అభివర్ణించారు. ఇవే ఫలితాలు రాబోయే ఎన్నికల్లోనూ పునరావృత్తమవుతాయని పేర్కొన్నారు.