ఉప ఎన్నికల్లో ప్రలోభలకు గురి చేస్తే చర్యలు
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
93 – మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంకు జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భముగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీ టి. వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయములో డబ్బు, మద్యం, వస్తువులు ఇచ్చి ఓటర్లను ప్రలోభ పరిచే వారి పైన, ఇట్టి డబ్బు, మద్యం , బహుమతులు తీసుకొనే వారి పైన ఇండియన్ పీనల్ కోడ్ 1861 చట్టం క్రమం కేసు నమోదు చేయడంతో పాటు, ఓటర్లను బెదిరింపులకు లేదా భయభ్రాంతులకు గురిచేసి వారిని ఓటింగ్ కు దూరంగా లేదా ప్రభావితం చేసే పైన కూడా క్రిమినల్ కేసులు నమైదు చేసి వారిపై తగిన చర్యలు తీసుకోవడానికి (14) ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, (18) స్టాటిక్ సర్వెలేన్స్ (చెక్ పోస్ట్) టీంలు, (18) మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీo లు, (7) వీడియో సర్వేలన్స్ టీం లను ఏర్పాటు చేసి , 24 గంటలు పర్యవేక్షిస్తూ, ఎన్నికలను ప్రజాస్వామ్య యుతంగా నిర్వహించటానికి అన్ని అవకాశాలను వినియోగించనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో పౌరులందరూ ఎటువంటి డబ్బు,మద్యం, ఇతర వస్తువులు తీసుకోకుండా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఏదైనా రాజకీయ పార్టీగానీ, పోటీచేసే వ్యక్తి గానీ, లేదా వారి ప్రతినిధులు గానీ డబ్బు,మద్యం, వస్తు బహుమతులను అందజేస్తే లేదా ఓటర్లను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసినట్లయితే, అట్టి పిర్యాదు లను టోల్ ఫ్రీ నెంబర్ 0868 2234238 నకు తెలియజేయాలి. పిర్యాదు దారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుంతుందని , కాబట్టి ఎవరు కూడా పిర్యాదు చేయటానికి సంకొచించాల్సిన అవసరం లేదని తెలియ జేశారు.
భారతీయ శిక్షా స్మృతి 1861 చట్టం ప్రకారం వివిధ ఎన్నికల నేరాలకు చట్టం లో పొందుపరచిన విషయాలను కూడా కలెక్టర్ వివరించారు.
1. సెక్షన్ 171బి ఇండియన్ పీనల్ కోడ్ 1861 ప్రకారం ఏ వ్యక్తి ని గానీ నగదు లేదా వస్తు రూపంలో ప్రలోభపరచటం లేదా వాటిని స్వీకరించడం గానీ చేసినచో ఒక సంవత్సరం వరకు గరిష్ఠంగా జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం కలదు .
2. సెక్షన్ 171C ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఏ వ్యక్తి అయినా ఓటర్లను ఏ రకంగా నైన బెదిరించడం లేదా భయభ్రాంతులకు గురి చేసినట్లయితే ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు విధించబడతాయి అని వివరించారు. కావున మునుగోడు నియోజక వర్గ ఓటర్ లందరూ అప్ర మత్తంగా ఉండాలని తెలియజేశారు.
Attachments area