ఉప ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం తగదు

 జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
 నల్గొండ బ్యూరో, జనం సాక్షి. .ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించ వద్దని, మును గోడ్ ఉప ఎన్నిక ను సీరియస్ గా తీసుకొని పని చేయాలని  జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు.శుక్రవారం చండూరు ఎం.పి.డి. ఓ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ ఎస్. పి. రెమా రాజేశ్వరి తో కలిసి సెక్టర్ అధికారులు,ఎం.సి.సి,వి.ఎస్.టి.,వి.వి.టి.,ఎస్.ఎస్.టి.టీమ్ లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పకడ్బందీ గా అమలు చేయాలని,ఓటర్లను ప్రలోభ పరిచేందుకు డబ్బు,మద్యం,వస్తువుల పంపిణీ నిరోధానికి చర్యలు తీసుకోవాలని అన్నారు ఉప ఎన్నిక విజయవంతం గా నిర్వహించాలని అన్నారు.                            ఎస్.పి. రెమా రాజేశ్వరి మాట్లాడుతూ పోలీస్ యంత్రాంగం రెవెన్యూ,ఎన్నికల విధుల్లో ఉన్న అన్ని శాఖల తో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు.శిక్షణా కార్యక్రమం లో మాస్టర్ ట్రైనర్ లు తరాల పరమేష్,వెంకటేశ్వర్లు,బాలు,సోమయ్య లు ఎన్నికల లో ఆయా టీమ్ లు నిర్వర్తించ వలసిన విధుల పై శిక్షణా లో అవగాహన కలిగించారు. ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,నల్గొండ అర్.డి. ఓ జయ చంద్ర రెడ్డి,,పోలీస్ అధికారులు పాల్గొన్నారు