ఉప విద్యాధికారిణిపై విచారణ
ఖమ్మం విద్యా విభాగం: ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసులో మధిర ఉపవిద్యాధికారిణి వెంకట నరసమ్మపై విచారణ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని పలువురు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులను మానసికంగా వేధించి దూషించారనే ఫిర్యాదు మేరకు విద్యాశాఖ వరంగల్ ప్రాంతీయ సంచాలకులు సురేందర్ రెడ్డి విచారణ చేస్తున్నారు. విచారణకు బాధిత ఉపాధ్యాయులతో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులు హాజరై రాత పూర్వకంగా తమ అభియోగాలను ఆర్జేడీకి అందించారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం నివేదికను రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు పంపనున్నట్లు ఆర్జేడీ తెలిపారు. విచారణ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి వెంకట రెడ్డి, ఆర్జేడీ కార్యాలయ ఏడీలు, ఆరోపణలు ఎదుర్కొన్న అధికారి వెంకట నరసమ్మ, ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు.