ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం
ఊపిరి పీల్చుకున్న పోలీసులు
బాసర బ్రిడ్జి వద్ద బారులు తీరిన వాహనాలు
ఆదిలాబాద్,సెప్టెంబర్13 (జనంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గణెళిశ్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిసాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. గత పక్షం రోజులుగా అలుపెరుగక గస్తీ కాసిన పోలీసులు నిమజ్జనం పూర్తి కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్,భైంసా,ఆదిలాబాద్, బోథ్, బాసర, మంచిర్యాల, తదితర ప్రాంతాల్లో నిమజ్జనం సజావుగా సాగింది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. నిర్మల్‌లో గణెళిష్ శోభాయాత్ర కన్నుల పండువగా జరిగింది. పట్టణంలోని బుధవార్‌పేట్
వినాయక మండపం వద్ద రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శశిధర్ రాజు, నిర్మల్ ఏఎంసీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మారుగొండ రాము, గణెళిష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు గండ్రత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
గణెళిశ్ నిమజ్జనం సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర వద్ద గల గోదావరి వంతెనపై ట్రాఫిక్ ఆంక్షలు విధించినా భారీగా గణెళిశ్‌లను తరలించడంతో కిలోవిూటర్ల మేర ట్రాపిక్ జామ్ అయ్యింది. బాసర నుంచి నిజామాబాద్ వైపు ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని తెలిపారు. బాసర సవిూపాన బీదిరెల్లి గ్రామం నుంచి మహారాష్ట్రలోని ధర్మాబాద్, కందకుర్తి, నవీపేట విూదుగా నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లీస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ పట్టణంతో పాటు చుట్టూ పక్కల జిల్లాల నుంచి, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వంతెనపై నుంచి గోదావరిలో గణపతులను నిమజ్జనం చేస్తారు. ఈసందర్భంగా వంతెనపై గంటల తరబడి నిమజ్జన కార్యక్రమాలు కొనసాగనుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రతీ సంవత్సరంలాగే ఈఏడాది కూ డా అధికారులు ఆంక్షలు విధించినట్లు తెలిపారు. అయినా భారీగా వాహనాలు తరలి రావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
శుక్రవారం సాయంత్రం వరకు పెద్దఎత్తున వినాయక నిమజ్జనం కొనసాగనుంది. ప్రతీయేటా 500-700 వరకు వినాయక ప్రతిమలు బాసర వద్ద నిమజ్జన చేస్తారు. ఈసారి కూడా గత అంచనాల తోనే అధికారులు ఏర్పాట్లు చేశారు. వంతెనపై లైట్లు, క్రేన్లను ఏర్పాటు చేశారు. ఇకపోతే నిర్మల్ జిల్లా భోసిలో వెలిసిన వరసిద్ధి కర్ర వినాయకుడిని గురువారం వైభవోపేతంగా నిమజ్జనం నిర్వహించారు. కర్ర వినాయకుడిని నిమజ్జనం చేయకుండా చిన్న వినాయకుడిని భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. వరసిద్ధి వినాయకుడి శోభాయాత్రలో అశేష భక్తజనం పాల్గొంది.