ఉమ్మడి జిల్లాలో 9స్థానాలపై టిఆర్‌ఎస్ గురి
26న మరోమారు కెసిఆర్ రాక
నిజామాబాద్,నవంబర్24(జనంసాక్షి): ఎన్నికల వేళ ఇందూరులో కేసీఆర్ సభలు టీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈనెల 26న మొదట నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి డిచ్‌పల్లిలో సభ నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది స్థానాలకు తొమ్మిందింటిని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందనే ధీమా గులాబీ శిబిరంలో కనిపిస్తున్నది. ఇదే క్రమంలో 26న నిజామాబాద్ రూరల్, బోధన్, బాల్కొండ నియోజకవర్గాల్లో, డిసెంబర్ మొదటి వారంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కేసీఆర్ సభలు నిర్వహించనున్నారు. వీటిని విజయవంతం చేసేందుకు ఎంపీ కవిత అన్నీ తానై పర్యవేక్షిస్తున్నారు. సభాస్థలి దగ్గర్నుంచి, జనసవిూకరణ వరకు ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ జిల్లాలో కేసీఆర్ సభలను విజయవంతం చేసేందుకు కృషిచేస్తున్నారు. అన్ని సమయాల్లో వెన్నంటి ఉండి ముందుకు నడిపిన జిల్లా నిజామాబాద్ అని, పార్టీ తరపున మొట్టమొదటి ఆత్మగౌరవ పతాక ఎగురవేసింది ఇక్కడి నుంచేనని ఆయన మరోమారు జిల్లాతో ఉన్న తన అనుబంధాన్ని ఆర్మూర్ వేదికగా మననం చేసుకున్నారు. మరోసారి తొమ్మిది నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది స్థానాలకు తొమ్మిందింటిని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందనే ధీమా గులాబీ శిబిరంలో కనిపిస్తున్నది. ఇదే విషయాన్ని ఆర్మూర్ సభ వేదికగా కేసీఆర్ ప్రకటించారు. తనకు అన్ని సమయాల్లో వెన్నంటి ఉండి ముందుకు నడిపిన జిల్లా నిజామాబాద్ అని, పార్టీ తరపున మొట్టమొదటి ఆత్మగౌరవ పతాక ఎగురవేసింది ఇక్కడి నుంచేనని ఆయన మరోమారు జిల్లాతో ఉన్న తన అనుబంధాన్ని ఆర్మూర్ వేదికగా మననం చేసుకున్నారు. మరోసారి తొమ్మిది నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. తొలిదశ ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ తర్వాత ఇందూరులోనే తొలి ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి నిజామాబాద్ నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున జనం తరలివచ్చి ఈ సభను విజయవంతం చేశారు. మలిదశ ప్రచారంలో భాగంగా నియోజకవర్గాల వారీగా ప్రచార సభలు నిర్వహించే క్రమంలో తనకు సెంటిమెంట్‌గా ఉన్న ఆర్మూర్ వేదికగా ప్రచార సభ ప్రారంభించారు. ఈనెల 22న ఆర్మూర్‌లో జరిగిన
ప్రచార సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. తరవాతజిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఒకేరోజు ప్రచార సభలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. అనంతరం బోధన్, చివరగా మోర్తాడ్‌లో భారీ బహిరంగ సభకు కేసీఆర్ హాజరుకానున్నారు. నిజామాబాద్ అర్బన్‌లో డిసెంబర్ మొదటి వారంలో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో జిల్లాలో టీఆర్‌ఎస్ శిబిరంలో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది.