ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ వర్షం
వర్షానికి గోడకూలి తల్లీ కూతుళ్లు మృతి
అప్రమత్తంగా ఉండాలని కోరిన సాగర్ ఎమ్మెల్యే భగత్
నల్లగొండ,జూలై8( జనంసాక్షి): ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నల్లగొండ పట్టణంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పద్మానగర్‌లోని ఓ ఇంటి గోడకూలి తల్లీకూతుళ్ళు దుర్మరణం చెందారు. తెల్లవారు జామున నిద్రిస్తున్న సమయంలో గోడకూలి బీరువా విూద పడడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు నడికుడి లక్ష్మీ(42) ఆమె కూతురు కళ్యాణి (21)గా గుర్తించారు. ఇటీవలే కళ్యాణికి వివాహం జరిగింది. ఆ కుటుంబం కొన్నేళ్లుగా శ్రీకాకుళం నుంచి వలస వచ్చి రైల్వే కూలీలకు వంట చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని మృతదేహాలను మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నల్గొండలోని పానగల్ బైపాస్ వద్ద భారీగా చేరిన వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. అటు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) 19.9 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మరోవైపు వర్షాల నేపథ్యంలో చండూరులో ప్రైవేట్ విద్యా సంస్థలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా.. అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలపై ఎమ్మెల్యే నోముల భగత్ స్పందించారు.
ªరిళితట్టు ప్రాంతాల్లో, ముంపు ప్రాంతలలో నివసించే ప్రజలకు భారీ వర్షాల సమాచారం ఎప్పటి కప్పుడు అందజేయాలని ఆయన ఆదేశించారు. అంతేకాదు.. వర్షాల వల్ల బలహీనంగా ఉండే చెరువు కట్టలు, పాత వంతెనలు, ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను హెచ్చరించారు.